248

మంచి కాపరి మా ప్రభు యేసే

మంచి కాపరి మా ప్రభు యేసే….మా కొరకు ప్రాణ మిచ్చే గొప్ప కాపరిమరణ మన్నను భయము లేదులే మదురమైన ప్రేమతో మమ్ము కాయులే1. పచ్చిక భయళ్ళలో విశ్రమింపగా శాంత జలాల చెంత అడుగు వేయగాచేయి విడువకా తోడు నిలుచును (2)నీతి మార్గమందు మమ్ము నడువజేయును2. అందకారలోయలో మా పయనంలో లేదులే మాకేభయం అభయం తానైఆదరించును ఆశీర్వదించును (2)అన్ని తావులందు తానే తోడైయుండును3. శత్రువుల మధ్యలో మాకు భోజనం అభిషేకం ఆనందం కృపా క్షేమంబ్రతుకు నిండగా పొంగి పొర్లగా (2)చిరకాలం ఆయనతో జీవింపగా