#264మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి
మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికిమాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి (2)1. పాప మమతల చేత – పారిపోయిన నాకు ప్రాప్తించె క్షామముపశ్చాత్తాప్పమునొంది – తండ్రి క్షమ కూరుచు పంపుము క్షేమము (2)ప్రభు నీదు సిలువ – ముఖము చెల్లని నాకు పుట్టించె ధైర్యము (2)2. ధనమే సర్వంబనుచు- సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితిధరణి భోగములెల్ల – బ్రతుకు ధ్వంసము జేయ దేహీ నిను చేరితి (2)దేహీ అని నీ వైపు – చేతులెత్తిన నాకు దారిని జూపుము (2)3. దూర దేశములోన – బాగుందుననుకొనుచు తప్పితి మార్గముతరలిపోయిరి నేను – నమ్మిన హితులెల్ల తరిమే దారిద్య్రము (2)దాక్షిణ్య మూర్తి నీ – దయ నాపై కురిపించి ధన్యుని చేయుము (2)4. అమ్ముకొంటిని నేను – అధముడొకనికి నాడు ఆకలి బాధలోఅన్యాయమయిపోయే – పందులు సహ వెలివేయ అలవడెను వేదన (2)అడుగంటె అవినీతి – మేల్కొనియె మానవత ఆశ్రయము గూర్చుము (2)5. కొడుకునే కాదనుచు – గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితికూలివానిగనైన – నీ యింట పని చేసి కనికరమే కోరుదు (2)కాదనకు నా తండ్రి – దిక్కెవ్వరును లేరు క్షమియించి బ్రోవుము (2)6. నా తండ్రి నను జూచి – పరుగిడిచూ ఏతెంచి నాపైబడి ఏడ్చెనునవ జీవమును గూర్చి – ఇంటికి తోడ్కొని వెళ్లి నన్నూ దీవించెను (2)నా జీవిత కథయంత – యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై యుండును (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.