263

మారని దేవుడవు నీవేనయ్యా

మారని దేవుడవు నీవేనయ్యామరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2)సుడులైనా సుడిగుండాలైనా – వ్యధలైనా వ్యాధి బాధలైనామరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2)1. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే (2) మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా (2) మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా (2)2. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా నిత్య జీవ గమ్యానికి నను నడిపించితివే (2) నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు (2) నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా (2)