488

కృపా క్షేమము నీ శాశ్వత జీవము

కృపా క్షేమము నీ శాశ్వత జీవమునా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు (2)మహోన్నతమైన నీ ఉపకారములుతలంచుచు అనుక్షణము పరవశించనానీ కృపలోనే పరవశించనా1. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులేలెక్కకు మించిన దీవెనలైనాయి (2)అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమేకడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను (2)నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్నునా యేసయ్య స్తుతిపాత్రుడా ఆరాధన నీకే (2)ఆరాధన నీకే ||కృపా క్షేమము||2. నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమేపరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి (2)కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమేగమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను (2)ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకేనా యేసయ్య స్తుతిపాత్రుడా ఆరాధన నీకే (2)ఆరాధన నీకే ||కృపా క్షేమము||3. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజానా హృది నీ కొరకు పదిలపరచితిని (2)బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగాఅవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా (2)ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకేప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే (2)ఆరాధన నీకే ||కృపా క్షేమము||