476

కనురెప్ప పాటైన

కనురెప్ప పాటైన కను మూయలేదు – ప్రేమ ప్రేమ ప్రేమనిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ (2)పగలూ రేయి పలకరిస్తోందిపరమును విడిచి నను వరియించింది (2)కలవరిస్తోంది ప్రేమాప్రాణమిచ్చిన కలువరి ప్రేమ ||కనురెప్ప||1. ప్రేమ చేతిలో నను చెక్కుకున్నదిప్రేమ రూపుతో నను మార్చియున్నది (2)ప్రేమను మించిన దైవం లేదనిప్రేమను కలిగి జీవించమని (2)ఎదురు చూస్తోంది ప్రేమాకలవరిస్తోంది క్రీస్తు ప్రేమ ||కనురెప్ప||2. ప్రేమ లోగిలికి నను పిలుచుచున్నదిప్రేమ కౌగిలిలో బంధించుచున్నది (2)ప్రేమకు ప్రేమే తోడవుతుందనిప్రేమకు సాటి లేనే లేదని (2)పరవశిస్తోంది ప్రేమాకలవరిస్తోంది క్రీస్తు ప్రేమ ||కనురెప్ప||