87

కలువరిగిరిలో సిలువధారియై

కలువరిగిరిలో సిలువధారియైవ్రేలాడితివా నా యేసయ్యా (2)1. అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షనుద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా (2)నా దోషక్రియలకై సిలువలో బలి అయితివానీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా (2)2. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగానుఏ దారి కానరాక సిలువ దరికి చేరాను (2)ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసినీ ప్రాణ త్యాగముతో విడిపించితివా (2)