#124జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో మేము దేవా
జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో మేము దేవాప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనంద గానంబుతో (2)1. సర్వ సమయములలో నీ స్తుతి గానంఎల్లవేళలయందు నీ నామ ధ్యానం (2)మాకదియే మేలు ఈ జీవితమునస్తుతియింతు నా రక్షకా – (2)2. సృష్టినంతటిని నీ మాట చేతసృజియించితివిగా మా దేవ దేవా (2)నీ ఘనమగు మహిమ వర్ణింప తరమాస్తుతియింతు నా రక్షకా – (2)3. కలుషాత్ములమైన మా కొరకు నీవిలువైన ప్రాణంబు నర్పించితివిగా (2)కల్వరి గిరిపై చూపిన ప్రేమన్స్తుతియింతు నా రక్షకా – (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.