376

హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు

హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండునిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను (2)1. పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడనతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు (2)2. కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడుయేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు (2)3. ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతనినాత – డెంతో దయచే బిలుచుచున్నా – డిప్పుడు మిమ్ములను (2)4. అతడు మిత్రుడతడు మిత్రుం – డఖిల పాపులకుమీర – లతని పిలుపు వింటి రేని – యతడు ప్రియుడగును (2)5. జాలి చేత దన హస్తముల – జాపి యున్నాడుమిమ్ము – నాలింగనము సేయ గోరి – యనిశము కనిపెట్టు (2)6. సాటిలేని దయగల వాడు – సర్వేశు సుతుడుతన – మాట వినెడు వారల నెల్ల – సూటిగ రక్షించు (2)7. చేర్చుకొనుడి మీ హృదయమున – శ్రీ యేసునాథునతడు – చేర్చుకొనుచు మీ కిచ్చును – చీర జీవము కృపను (2)8. అతడు తప్పక కలుగజేయు – నఖిల భాగ్యములుమీర – లతని హత్తుకొందు రప్పు – డానందము తోడ (2)9. బ్రతుకు శాశ్వతంబు కాదు – పరికించు చూడుగాన – బ్రతికి యుండు కాలముననే – ప్రభుని గొలువండి (2)