105

గాయపడిన నీ చేయి చాపుము దేవా

గాయపడిన నీ చేయి చాపుము దేవానీ సిలువ రక్తమును ప్రోక్షించుము నా ప్రభువా (2)సిలువే నాకు విలువైనది (2)అదియే నా బ్రతుకున గమ్యమైనది – ఎంతో రమ్యమైనది1. ఎండిన భూమిలో మొలచిన లేత – మొక్క వలె నీవు ఎదిగితివి (2)సురూపమైనా ఏ సొగసైనా (2) లేనివానిగా నాకై మారితివి2. మనుషులందరు చూడనొల్లని – రూపముగా నాకై మారితివి (2)మా రోగములు మా వ్యసనములు (2) నిశ్చయముగా నీవు భరియించితివి3. నీవు పొందిన దెబ్బల వలన స్వస్థత నాకు కలిగినది (2)నీవు కార్చిన రక్తమే (2) మా అందరికీ ఇల ప్రాణాధారము