106

గాయములన్ గాయములన్ మన కొరకై పొందెను క్రీస్తు ప్రభు

గాయములన్ గాయములన్ మన కొరకై పొందెను క్రీస్తు ప్రభు1. సురూపమైన సొగసైన లేదు దుఃఖ భరితుడాయెనువ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందె వీక్షించి త్రిప్పిరి ముఖముల్2. మన రోగములను మన దుఃఖములను మనకై తానే భరియించేమొత్తబడెను బాధింపబడెను ఎంతో శ్రమనొందె మనకై3. మనయతిక్రమ క్రియలను బట్టి మరినలుగ గొట్టబడెనుతాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగె మనకు4. పాపంబు కపటంబు లేదు ప్రభునందు మౌనం వహియించె మనకైప్రాణంబు మనకై ప్రియముగనర్పించె ప్రభువే ఘోరసిలువపై5. క్రీస్తు ప్రేమను మరువ జాలము ఎంతో ప్రేమించే మనలసిలువపై మనము గమనింప మనకు విలువైన విడుదల కలిగె