461

ఎవరు చూపించలేని

ఎవరు చూపించలేని – ఇలలో నను వీడిపోనిఎంతటి ప్రేమ నీది – ఇంతగా కోరుకుంది – మరువను యేసయ్యా (2)నీ కథే నన్నే తాకగా – నా మదే నిన్నే చేరగానా గురే నీవై యుండగా – నీ దరే నే చేరానుగా ||ఎవరు||1. తీరాలే దూరమాయే – కాలాలే మారిపోయేఎదురైన ఎండమావే – కన్నీటి కానుకాయేనా గుండె లోతులోన – నే నలిగిపోతువున్నాఏ దారి కానరాక – నీ కొరకు వేచివున్నాఎడబాటులేని గమనాన – నిను చేరుకున్న సమయాననను ఆదరించే ఘన ప్రేమ – అపురూపమైన తొలిప్రేమఏకమై తోడుగా – ఊపిరే నీవుగాఎవ్వరూ లేరుగా – యేసయ్యా నీవెగా ||ఎవరు||2. ఈ లోక జీవితాన – వేసారిపోతువున్నావిలువైన నీదు వాక్యం – వెలిగించె నా ప్రాణంనీ సన్నిధానమందు – సీయోను మార్గమందునీ దివ్య సేవలోనే – నడిపించే నా ప్రభూనీ తోటి సాగు పయనాన – నను వీడలేదు క్షణమైననీ స్వరము చాలు ఉదయాన – నిను వెంబడించు తరుణానశాశ్వత ప్రేమతో – సత్యవాక్యంబుతోనిత్యము తోడుగా – నిలిచె నా యేసయ్యా ||ఎవరు||