#454ఎంతో సుందరుడమ్మ తాను
ఎంతో సుందరుడమ్మ తానునేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో||1. ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు (2)అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2)ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడుఅవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2)ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2)అవలీలగా నతని గురితింపగలనమ్మా (2) ||ఎంతో||2. కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు (2)మరులు మనసున నింపు మహనీయుడాతండు (2)కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడుమరులు మనసున నింపు మహనీయుడాతండు (2)సిరులు కురిపించేను వరదేవ తనయుండు (2)విరబూయు పరలోక షారోను విరజాజి (2) ||ఎంతో||3. పాలతో కడిగిన నయనాలు గలవాడు (2)విలువగు రత్నాల వలె పొదిగిన కనులు (2)పాలతో కడిగిన నయనాలు గలవాడువిలువగు రత్నాల వలె పొదిగిన కనులు (2)కలుషము కడిగిన కమలాల కనుదోయి (2)విలువైన చూపొసగె వరమేరి తనయుండు (2) ||ఎంతో||4. మేలిమి బంగారు స్థలమందు నిలిపిన (2)చలువ రాతిని బోలు బలమైన పాదాలు (2)మేలిమి బంగారు స్థలమందు నిలిచినాచలువ రాతిని బోలు బలమైన పాదాలు (2)ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. (2)బలవంతుడగువాడు బహుప్రియుడాతండు (2) ||ఎంతో||5. అతడతికాంక్షానీయుండు తనయుండు (2)అతడే నా ప్రియుడు అతడే నా హితుడు (2)అతడతికాంక్షానీయుండు తనయుండుఅతడే నా ప్రియుడు అతడే నా హితుడు (2)ఆతని నొరతి మధురంబు మధురంబు (2)ఆతని పలువరుస ముత్యాల సరివరుస (2) ||ఎంతో||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.