469

ఏమైనా చేయగలవు

స్థిరపరచువాడవు బలపరచువాడవుపడిపోయిన చోటే నిలబెట్టువాడవుఘనపరచువాడవు హెచ్చించువాడవుమా పక్షము నిలిచి జయమిచ్చువాడవు (2)ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవునీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు (2)యేసయ్యా.. యేసయ్యా.. నీకే నీకే సాధ్యము (2)1. సర్వకృపానిధి మా పరమ కుమ్మరినీ చేతిలోనే మా జీవమున్నది (2)మా దేవా నీ ఆలోచనలన్ని ఎంతో గొప్పవిమా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి (2) ||ఏమైనా||2. నీ ఆజ్ఞ లేనిదే ఏదైన జరుగునా?నీ కంచె దాటగ శత్రువుకు సాధ్యమా? (2)మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలునుఅపవాది తలచిన కీడులన్ని మేలైపోవును (2) ||ఏమైనా||