385

ఎల్లవేళలందు కష్టకాలమందు

ఎల్లవేళలందు – కష్టకాలమందువల్లభుండా యేసున్‌ స్తుతింతున్‌ఎల్లను నీవే నా కెల్లెడలవల్లపడదే వివరింపన్‌ (2)విమోచకుడా – విమోచన నీవేరక్షకుడవు – నా రక్షణ నీవే (2)సృష్టికర్తవు – సహాయము నీవేఇష్టుడ నీవు – త్రిత్వము నీవే (2)జ్ఞానము నీవే – నా పానము నీవేదానము నీవే – నా గానము నీవే (2)జ్యోతివి నీవే – నా నీతివి నీవేఆదియు నీవే – నా అంతము నీవే (2)నిత్యుడ నీవే – నా సత్యుండ నీవేస్తోత్రము నీవే – నా నేత్రము నీవే (2)జీవము నీవే – నా దేవుడవు నీవేపావన నీవే – నా కావలి నీవే (2)కాంతియు నీవే – నా శాంతియు నీవేసంతస నీవే – నాకంతయు నీవే (2)