449

ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి

ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి (2)చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటోదేవుని సంకల్పం ఇది సృష్టిలోని చిత్రం (2)1. ఒంటరి బ్రతుకును విడిచెదరుఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు (2)పెళ్లినాటి నుండి తల్లి దండ్రుల వదలిభార్య భర్తలు హత్తుకొనుటేమిటో ||దేవుని||2. గత కాల కీడంతా మరచెదరువీనులతో సంతసించెదరు (2)పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరుఇష్టముతో పంచుకొనుటేమిటో ||దేవుని||3. ఫలియించి భూమిని నింపెదరువిస్తరించి వృద్ధి పొందెదరు (2)పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో ||దేవుని||