#465ఏ యోగ్యతా లేని నన్ను
ఏ యోగ్యతా లేని నన్ను నీవు ప్రేమించినావు దేవాఏ అర్హతా లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువానీకేమి చెల్లింతునునీ ఋణమెలా తీర్చెదను (2) ||ఏ యోగ్యతా||1. కలుషితుడైన పాపాత్ముడనునిష్కళంకముగా నను మార్చుటకు (2)పావన దేహంలో గాయాలు పొంది (2)రక్తమంత చిందించినావా ||నీకేమి||2. సుందరమైన నీ రూపమునుమంటివాడనైన నాకీయుటకు (2)వస్త్రహీనుడుగా సిలువలో వ్రేలాడి (2)నీ సొగసును కోల్పోయినావా ||నీకేమి||3. పాపము వలన మృతినొందినఅపరాధినైన నను లేపుటకు (2)నా స్థానమందు నా శిక్ష భరించి (2)మరణించి తిరిగి లేచావా ||నీకేమి||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.