#140దూత పాట పాడుడి
1. దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడిఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేము నందునభూజనంబు కెల్లను – సౌఖ్య సంభ్రమాయెనుఆకసంబు నందున – మ్రోగు పాట చాటుడిదూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి2. ఊర్ధ్వ లోకమందున – గొల్వగాను శుద్దులుఅంత్య కాలమందున – కన్య గర్భమందునబుట్టినట్టి రక్షకా – ఓ ఇమ్మానుయేల్ ప్రభోఓ నరావతారుడా – నిన్ను నెన్న శక్యమాదూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి3. రావే నీతి సూర్యుడా – రావే దేవా పుత్రుడానీదు రాక వల్లను – లోక సౌఖ్య మాయెనుభూ నివాసులందరూ – మృత్యు భీతి గెల్తురునిన్ను నమ్ము వారికి – ఆత్మ శుద్ది కల్గునుదూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.