#583భజన చేయుచు భక్తపాలక
భజన చేయుచు భక్తపాలకప్రస్తుతింతు నీ నామమును (2)వృజినములపై జయము నిచ్చిన (2)విజయుడా నిను వేడుకొందు ||భజన||దివ్య పదవిని విడిచి నీవుదీనుడవై పుట్టినావు (2)భవ్యమైన బోధలెన్నో (2)బాగుగా ధర నేర్పినావు ||భజన||నరుల గావను పరమునుండిధరకు నీవు వచ్చినావు (2)పరుడ నైన నా కొరకు నీ (2)ప్రాణము నర్పించినావు ||భజన||చెడినవాడ నైన నన్నుజేరదీసి ప్రోచినావు (2)పడిన నాడు గోతి నుండి (2)పైకి లేవనెత్తి నావు ||భజన||ఎంత ప్రేమ ఎంత దయఎంత కృప యేసయ్య నీకు (2)ఇంతయని వర్ణింప నిలలో (2)నెవనికిని సాధ్యంబు కాదు ||భజన||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.