26

ఆయనే నా సంగీతము – బలమైన కోటయును

ఆయనే నా సంగీతము – బలమైన కోటయునుజీవాధిపతియు ఆయనే – జీవితకాలమెల్ల స్తుతించెదను1. స్తుతుల మధ్యలో నివాసం చేసి – దూత లెల్ల పొగడే దేవుడాయనేవేడుచుండు భక్తుల స్వరము విని – దిక్కులేని పిల్లలకు దేవుడాయనే2. ఇద్దరు ముగ్గురు నా నామమున – ఏకీభవించిన వారి మధ్యలోనఉండెదననిన మనదేవుని – కరములు తట్టి నిత్యము స్తుతించెదము3. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున – జీవిత కాలమెల్ల కీర్తించెదమురాకడలో ప్రభుతో నిత్యముందుము – మ్రొక్కెదము స్తుతించెదము పొగడెదము