#27ఆరని ప్రేమ ఇది – ఆర్పజాలని జ్వాల ఇది
ఆరని ప్రేమ ఇది – ఆర్పజాలని జ్వాల ఇది (2)అతి శ్రేష్టమైనది – అంతమే లేనిదిఅవధులే లేనిది – అక్షయమైన ప్రేమ ఇది (2)కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2)1. సింహాసనము నుండి – సిలువకు దిగి వచ్చినదిబలమైనది మరణము కన్నా – మృతిని గెల్చి లేచినది (2)ఇది సజీవమైనది – ఇదే సత్యమైనదిఇదే నిత్యమైనది – క్రీస్తు యేసు ప్రేమ ఇది (2)కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2)2. నా స్థానమందు నిలిచి – నా శిక్షనే భరియించిక్రయ ధనమును చెల్లించి – గొప్ప రక్షణ నిచ్చినది (2)నాకు విలువను ఇచ్చినది – నన్ను వెలిగించినదిఆ ఉన్నత రాజ్యమందు – నాకు స్థానమిచ్చినది (2)ఉన్నత ప్రేమ ఇది – అత్యున్నత ప్రేమ ఇది (2)3. భూ రాజులు అధిపతులు – రాజ్యాలు అధికారాలుచెరయైనా ఖడ్గమైనా – కరువైనా ఎదురైన (2)ఎవరు ఆపలేనిది – ఎవరు ఆర్పలేనిదిప్రవహించుచున్నది – ప్రతి పాపి చెంతకు (2)ప్రేమ ప్రవాహమిది – యేసు ప్రేమ ప్రవాహమిది (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.