#441ఆనందమే పరమానందమే
ఆనందమే పరమానందమేఆశ్రయపురమైన యేసయ్యా నీలో (2)ఆపత్కాలములన్నిటిలో ఆదరించినఅక్షయుడా నీకే స్తోత్రము (2) ||ఆనందమే||1. పచ్చిక గల చోట్ల పరుండ జేసితివేజీవ జలములు త్రాగనిచ్చితివే (2)నా ప్రాణమునకు సేదదీర్చితివినీతియు శాంతియు నాకిచ్చితివే (2) ||ఆనందమే||2. గాఢాంధకారము లోయలలో నేనుసంచరించినా దేనికి భయపడను (2)నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమునుఅనుదినం అనుక్షణం కాపాడునే (2) ||ఆనందమే||3. నా శత్రువుల ఎదుటే నీవునాకు విందును సిద్ధము చేసావు (2)నీతో నేను నీ మందిరములోనివాసము చేసెద చిరకాలము (2) ||ఆనందమే||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.