23

ఆధారం నీవేనయ్యా

ఆధారం నీవేనయ్యా (2)కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యాయేసయ్యా కారణం నీవేనయ్యా1. లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనింత కాలం (2)అయినను ఎందుకో నెమ్మది లేదు (2)సమాధానం కొదువైనది యేసయ్యా సమాధానం కొదువైనది2. ఐశ్వర్యం కొదువేమి లేదు కుటుంబములో కలతేమి లేదు (2)అయినను ఎందుకో నెమ్మది లేదు (2)సమాధానం కొదువైనది యేసయ్యా సమాధానం కొదువైనది3. నీ సేవకునిగా జీవింప హృదయంలో ఉన్నకోర్కెలను (2)హృదయము నిచ్చావు నెమ్మది నొందా (2)సాక్షిగా జీవింతును హల్లేలూయ సాక్షిగా జీవింతును