#268యుద్ధము యెహోవాదే
యుద్ధము యెహోవాదే (4)రాజులు మనకెవ్వరు లేరు – శూరులు మనకెవ్వరు లేరు (2)సైన్యములకు అధిపతియైన – యెహోవా మన అండ1. వ్యాధులు మనలను పడద్రోసినా – బాధలు మనలను కృంగదీసినా (2) విశ్వాసమునకు కర్తయైన – యేసయ్యే మన అండ2. ఎరికో గోడలు ముందున్నా – ఎర్ర సముద్రము ఎదురైనా (2) అద్భుత దేవుడు మనకుండా – భయమేల మనకింకా3. అపవాదియైన సాతాను – గర్జించు సింహము వలె వచ్చినా (2) యూదా గోత్రపు సింహమైనా – యేసయ్యే మన అండ

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.