276

యెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరి

యెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరిమాకు లేనిదే లేదు లేమి కలుగదు (2)1. వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను –ఆత్మ జలములో దప్పిక తీర్చెను (2)మా ప్రాణములు సేదదీర్చేను –నీతి మార్గమున నడిపించెను2. కారు చీకటిలో కన్నీరు తుడిచెను –మరణ పడకలో ఊపిరి పోసెను (2)మా తోడు నీడై నిలిచి నడిచెను –శత్రు పీఠమున విందు చేసెను3. పరిశుద్ధాత్మలో ముంచి వేసెను –పరమానందము పొంగిపోయెను (2)పరలోకములో గొరియపిల్లను –నిరతము మేము కీర్తింతుము