340

సర్వకృపానిధియగు ప్రభువా

సర్వకృపానిధియగు ప్రభువాసకల చరాచర సంతోషమా (2)స్తోత్రము చేసి స్తుతించెదనుసంతసముగ నిను పొగడెదను (2)హల్లెలూయా హల్లెలూయా… హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా యని పాడెదను ఆనందముతో సాగెదనునేను… ఆనందముతో సాగెదనుప్రేమించి నన్ను వెదకితివిప్రీతితో నను రక్షించితివి (2)పరిశుద్ధముగా జీవించుటకైపాపిని నను కరుణించితివి (2)అల్పకాల శ్రమలనుభవింపఅనుదినము కృపనిచ్చితివి (2)నాథుని అడుగుజాడలలోనడుచుటకు నను పిలిచితివి (2)మరణ శరీరము మర్పునొందిమహిమ శరీరము పొందుటకై (2)మహిమాత్మతో నను నింపితివిమరణ భయములను తీర్చితివి (2)భువినుండి శ్రేష్ట ఫలముగనుదేవునికి నిత్య స్వాస్థ్యముగా (2)భూజనములలోనుండి నన్నుప్రేమించి క్రయ ధనమిచ్చితివి (2)ఎవరూ పాడని గీతములుయేసుతో నేను పాడుటకై (2)హేతువు లేకయే ప్రేమించెన్‌యేసుకు నేనేమివ్వగలన్‌ (2)