213

పరమ దైవమే మనుష్య రూపమై

పరమ దైవమే మనుష్య రూపమైఉదయించెను నా కోసమేఅమర జీవమే నరుల కోసమైదిగి వచ్చెను ఈ లోకమేక్రీస్తు పుట్టెను – హల్లెలూయక్రీస్తు పుట్టెను – హల్లెలూయక్రీస్తు పుట్టెను – హల్లెలూయా (2)1. ఆకార రహితుడు ఆత్మ స్వరూపుడుశరీరమును ధరించెనుసర్వాధికారుడు బలాఢ్య ధీరుడుదీనత్వమును వరించెనువైభవమును విడిచెను – దాసునిగను మారెను – (2)దీవెన భువికి తెచ్చెను – ముక్తి బాటగా…2. అనాది వాక్యమే కృపా సమేతమైధరపై కాలు మోపెనుఆ నీతి తేజమే నరావతారమైశిశువై జననమాయెనుపాపి జతను కోరెను – రిక్తుడు తానాయెను (2)భూలోకమును చేరెను – యేసు రాజుగా…3. నిత్యుడు తండ్రియే విమోచనార్ధమైకుమారుడై జనించెనుసత్య స్వరూపియే రక్షణ ధ్యేయమైరాజ్యమునే భరించెనుమధ్య గోడ కూల్చను – సంధిని సమకూర్చను – (2)సఖ్యత నిలుప వచ్చెను – శాంతి దూతగా…