566

పరదేశులమో ప్రియులారా మన

పరదేశులమో ప్రియులారా మనపురమిది గాదెపుడు (నిజముగ) (2) ||పరదేశుల||చిత్ర వస్తువులు చెల్లెడి యొకవిచిత్రమైన సంత (లోకము) (2) ||పరదేశుల||సంత గొల్లు క్షమ సడలిన చందంబంతయు సద్దణగన్ (నిజముగ) (2) ||పరదేశుల||స్థిరమని నమ్మకు ధర యెవ్వరికినిబరలోకమే స్థిరము (నిజముగ) (2) ||పరదేశుల||మేడలు మిద్దెలు మేలగు సరకులుపాడై కనబడవే (నిజముగ) (2) ||పరదేశుల||ధర ధాన్యంబులు దరగక మానవుపని పాటలు పోయె (నిజముగ) (2) ||పరదేశుల||ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికినమన్నై పోవునుగా (దేహము) (2) ||పరదేశుల||వచ్చితి మిచటికి వట్టి హస్తములదెచ్చిన దేదియు లే (దు గదా) (2) ||పరదేశుల||ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకుఅట్లు వెళ్ళవలయున్ (మింటికి) (2) ||పరదేశుల||యేసు నందు విశ్వాసం బుంచినవాసిగ నిను జేర్చున్ (బరమున) (2) ||పరదేశుల||యేసే మార్గము యేసే సత్యముయేసే జీవముగా (నిజముగ) (2) ||పరదేశుల||