206

నేడో రేపో నా ప్రియుడేసు

నేడో రేపో నా ప్రియుడేసుమేఘాలమీద కేతెంచునుమహిమాన్వితుడై ప్రభు యేసుమహీతలమునకు ఏతెంచును1. చీకటి కమ్మును సూర్యునిచంద్రుడు తన కాంతినీయడు (2)నక్షత్రములు రాలిపోవునుఆకాశ శక్తులు కదలిపోవును (2)2. కడబూర స్వరము ధ్వనియించగాప్రియుని స్వరము వినిపించగా (2)వడివడిగ ప్రభు చెంతకు చేరెదప్రియమార ప్రభుయేసుని గాంచెద (2)3. నా ప్రియుడేసుని సన్నిధిలోవేదన రోదనలుండవు (2)హల్లెలూయా స్తుతిగీతాలతోనిత్యము ఆనందమానందమే (2)