#47ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట
ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంటఎందుకో ఎందుకే కోయిలాచెప్పవే చెప్పవే కోయిలామల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసె నేడుఎందుకో ఎందుకే కోయిలాచెప్పవే చెప్పవే కోయిలాఆ… అర్దరాత్రి కాలమందు వెన్నెల… ఆహాఆశ్చర్యకరుడంట వెన్నెల… ఆహా (2)జన్మించినాడంట వెన్నెలాఈ అవనిలోనంట వెన్నెలా (2)1. హా… ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలాచెప్పవే చెప్పవే కోయిలా (2)ఆ… యూదా దేశమందు వెన్నెల… ఆహాబెత్లెహేము పురమునందు వెన్నెల… ఆహా (2)రాజులకు రాజంట వెన్నెలాఆ రాజు యేసంట వెన్నెల (2)2. ఆహ… తార చూపు దారిలోనే వచ్చినారు ఎవ్వరే కోయిలాచెప్పవే చెప్పవే కోయిలా (2)ఆ తూర్పు దేశ జ్ఞానులమ్మ వెన్నెల… ఆహాదర్శింప వచ్చినారు వెన్నెల… ఆహా (2)బంగారు సాంబ్రాణి బోళంతెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా (2)3. ఆ… దివి నుండి ఈ భువికి వచ్చినాడు ఎందుకే కోయిలాచెప్పవే చెప్పవే కోయిలా (2)పాపులైన మనకోసం వెన్నెల… ఆహాప్రాణాన్ని అర్పించి వెన్నెల… ఆహా (2)పరలోకానికి మార్గం వెన్నెలాఉచితంగా ఇచ్చినాడు వెన్నెలా (2)4. హా.. పరలోకం చేరుటకై నేనేమి చెయ్యాలి కోయిలాచెప్పవే చెప్పవే కోయిలా (2)యేసయ్యను నమ్ముకో వెన్నెల… ఆహాపాపాలను ఒప్పుకో వెన్నెల… ఆహా (2)క్రొత్తగా జన్మించు వెన్నెలారక్షణను పొందుకో వెన్నెలా (2)
Previous Songఇరువది నలుగురు పెద్దలతో – పరిశుద్ధ దూతల సమూహముతో
Next Songఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.