#495గొర్రెపిల్ల వివాహోత్సవ
గొర్రెపిల్ల వివాహోత్సవసమయము వచ్చెను రండి (2)1. సర్వాధికారియు సర్వోన్నతుండైన (2)మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము (2) ||గొర్రెపిల్ల||2. సిద్ధపడెను వధువు సుప్రకాశము గల (2)నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల||3. పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు (2)గొర్రెపిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు (2) ||గొర్రెపిల్ల||4. తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు (2)నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు (2) ||గొర్రెపిల్ల||5. దేవుని వాక్యమను నామము గలవాడు (2)రక్తములో ముంచిన వస్త్రమున్ ధరియించె (2) ||గొర్రెపిల్ల||6. ప్రేమించి సంఘముకై ప్రాణంబు నిదె ప్రభువు (2)పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల||7. శ్రీ యేసు క్రీస్తుండే సంఘంబునకు శిరస్సు (2)వాక్య ఉదకము తోడ శుద్ధి పరచుచుండె (2) ||గొర్రెపిల్ల||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.