Dear brothers and sisters,
A faithful servant of Christ, Pastor John MacArthur of Grace Community Church in Sun Valley, California—after 56 years of faithful ministry—has entered into the presence of the Lord on July 14, 2025, shortly after 6 p.m. PT (July 15, 2025, around 6:30 a.m. IST) following a bout with pneumonia.
He preached over 3,000 sermons, authored nearly 400 books, founded Grace to You, and led The Master’s University and Seminary, all while standing firm in his convictions—even resisting COVID lockdowns.
Let his unwavering faith challenge us: let us live godly, stand firm, and excel in the work of the Lord.
“Therefore, my beloved brothers and sisters, be firm, immovable, always excelling in the work of the Lord, knowing that your labor is not in vain in the Lord.” — 1 Corinthians 15:58 (NASB)
May this news spur us on in our devotion and endurance, just as Pastor MacArthur so faithfully exemplified.
ప్రియమైన సహోదర సహోదరిలారా,
సన్ వ్యాలీ, కాలిఫోర్నియాలో గల గ్రేస్ కమ్యూనిటీ చర్చ్ పాస్టర్, క్రీస్తు యొక్క నమ్మకమైన సేవకుడు అయిన జాన్ మాకార్తర్ గారు, 56 సంవత్సరాల విశ్వాసపూర్వక సేవ తరువాత, న్యూమోనియా కారణంగా చికిత్స పొందుతూ, జూలై 14, 2025 సాయంత్రం 6:00 గంటలకు PT (భారత కాలమానం ప్రకారం జూలై 15, 2025 ఉదయం 6:30 IST) ప్రభువుని సన్నిధికి వెళ్లిపోయారు.
ఆయన 3,000 కంటే ఎక్కువ సందేశాలు ప్రసంగించి, దాదాపు 400 పుస్తకాలు రచించి, “గ్రేస్ టూ యూ” ని వ్యవస్థాపించి, ది మాస్టర్స్ యూనివర్సిటీ మరియు సెమినరీ కి నేతృత్వం వహించారు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలోనూ తన బలమైన నమ్మకాలను నిలబెట్టుకున్నారు.
ఆయన యొక్క అచంచలమైన విశ్వాసం మనకూ ప్రేరణ కలిగించును గాక!. మనమును కూడా భక్తిపరమైన జీవితం గడుపుతూ, స్థిరంగా నిలిచి, ప్రభువు కార్యంలో అభివృద్ధి చెందుటకు కృషి చేద్దాం.
“కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.” — 1 కోరింథీయులకు 15:58
ఈ వార్త , పాస్టర్ మాకార్తర్ గారు చూపిన విధంగా మన విశ్వాసాన్ని మరియు నిబద్ధతను మరింత బలపరచుటకు ప్రేరణ కలుగజేయును గాక!