నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా
నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా
నాలో ప్రాణం పోసిన ప్రాణదాతవయ్యా
నా కుమ్మరి నీవే – నా ప్రాణము నీవే (2)
నా బలము నీవే – నా ఆత్మ నీవే (2)
1. నేను ఎండలో వెళితే నీడను ఇచ్చావు, ఆ చీకటిలోనే వెలుగై నిలిచావు
నా నీడ నీవే – నా వెలుగు నీవే – నా బలము నీవే – నా ఆత్మ నీవే (2)
2. నేను దారికానక తిరుగువేళ నాకు దారిని చూపి నడిపించావయ్యా
నా దారి నీవే – నా దిక్కు నీవే – నా బలము నీవే – నా ఆత్మ నీవే (2)
3. మన ప్రభువుల ప్రభువు వస్తున్నారు
మనలను ఆయనతో కూడా తీసుకువెళతారు
నా ప్రభువు నీవే – నా రాజువు నీవే – నా బలము నీవే – నా ఆత్మ నీవే (2)
(Nannu Bommanu Chesina Kummari Neevayyaa Naalo Praanam Posina Praanadaathavayyaa)