నేడో రేపో నా ప్రియుడేసు
మేఘాలమీద కేతెంచును
మహిమాన్వితుడై ప్రభు యేసు
మహీతలమునకు ఏతెంచును ||నేడో రేపో||
1. చీకటి కమ్మును సూర్యుని
చంద్రుడు తన కాంతినీయడు (2)
నక్షత్రములు రాలిపోవును
ఆకాశ శక్తులు కదలిపోవును (2) ||నేడో రేపో||
2. కడబూర స్వరము ధ్వనియించగా
ప్రియుని స్వరము వినిపించగా (2)
వడివడిగ ప్రభు చెంతకు చేరెద
ప్రియమార ప్రభుయేసుని గాంచెద (2) ||నేడో రేపో||
3. నా ప్రియుడేసుని సన్నిధిలో
వేదన రోదనలుండవు (2)
హల్లెలూయా స్తుతిగీతాలతో
నిత్యము ఆనందమానందమే (2) ||నేడో రేపో||
(Nedo Repo Naa Priyudesu Meghala Meeda Kethenchunu)