ఈ లాటిదా యేసు ప్రేమ

ఈ లాటిదా యేసు ప్రేమ
నన్ను తూలనాడక తనదు జాలి చూపినదా

1 ఎనలేని పాప కూపమున
నేను తనికి మినుకుచునునే దరిగానకుండన్
కనికరముబెంచి నాయందు
వేగ గొనిపోవ నా మేలు కొరకిందు వచ్చెన్

2 నెమ్మిరవ్వంతైన లేక
చింతక్రమ్మి పొగలుచునుండ గా నన్ను జూచి
సమ్మతిని నను బ్రోవదలచి
కరముజూచినా చెయిబట్టి చక్కగా బిలిచె

3 పనికివాలిన వాడనైన నేను
కనుపరచు నా దోష కపట వర్తనము
మనసునుంచక తాపపడక
యింత ఘనమైన రక్షణమును నాకు జూపె

4 శోధనలు ననుజుట్టినపుడు
నీతిబోధ నామనసులో బుట్టించి పెంచి
బాధలెల్లను బాపిమాపి
యిట్టియాదరణ జూపెనాయహహా యేమందు

(Eelaatidaa Yesu Prema)