లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు

లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు
లేచినాడురా సమాధి గెలిచినాడురా
లేతునని తా జేప్పినట్లు లేఖనములలో పలికినట్లు

1 చచ్చిపోయి లేచినాడు స్వామిభక్తుల కగుపడినాడు
చచ్చినను ననులేపుతాడు చావు అంటే భయపదరాదు

2 పాపభారము లేదు మనకు మరణ భయము లేదు మనకు
నరక బాధలేదు మనకు మరువకండి యేసుప్రభుని

3 యేసునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్యజీవం
యేసునందే ఆత్మశాంతి యేసునందే మోక్షభాగ్యం

4 పాపులకై వచ్చినాడు పాపులను కరుణించినవాడు
పాపులను ప్రేమించినాడు ప్రానదానము చేసినాడు

(Lechinaaduraa Samaadhi Gelichinaaduraa Yesu)