సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కలువరిలో

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కలువరిలో
తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్య (2)
వెలియైన యేసయ్య బలియైన యేసయ్య (2)
నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా

1 నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ మోయ లేక మోశావు
కొరడాలు చెల్లని చీల్చెనే నీ సుందర దేహమునే (2)
తడిపెను నీ తనువునే రుధిరంపుధారాలే

2 నాదు ఘోర పాపం నిను సిలువకు గురిచేసెన్
నాదు దోషమే నిన్నుఅణువణువున హింసించెన్
దూషించి అపహసించి హింసింఛిరా నిన్ను (2)
ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా

(Siluvalo Aa Siluvalo Aa Ghora Kaluvarilo)