సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు
పౌలు వలెను, సీల వలెను సిద్ధపడిన భక్తుల జూచి
1. కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించు
పండియున్న పాపులనైన పిలచుచుండె పరముజేర
2. వందగొర్రెల మందలో నుండి ఒకటితప్పి ఒంటరియాయె
తొంబదితొమ్మిది గొర్రెల విడచి ఒంటరియైన గొర్రెను వెదకెన్
3. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయె
తప్పు తెలిసి తిరిగిరాగా తండ్రియతని చేర్చుకొనెను
4. పాపిరావా పాపము విడిచి పరిశుద్ధుల విందులొజేర
పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి యంతం
(Siluva Chentha Cherinanaadu Kalushamulanu Kadigiveyu)