బంగారం అడుగలేదు వజ్రాలు అడుగలేదు
హృదయాన్ని అడిగావయ్యా
ఆస్తుల్నిఅడుగలేదు అంతస్తులు అడుగలేదు
నాకోసం వచ్చావయ్యా..
కన్నీటిని తుడిచావయ్యా – సంతోషాన్ని ఇచ్చావయ్యా..
మనుషులను చేశావయ్యా – నీ రూపాన్ని ఇచ్చావయ్యా
నా యేసయ్యా… నా యేసయ్యా… (2)
1.పాపాన్ని బాపేటి శాపాన్ని బాపేటి
నాకోసం వచ్చావయ్యా
కష్టాన్ని తీర్చేటి నష్టాన్ని ఓర్చేటి
నాకోసం వచ్చావయ్యా || కన్నీటిని||
2.రక్తాన్ని చిందించి రక్షణను అందించి
మోక్షాన్ని ఇచ్చావయ్యా
ధనవంతులుగా మమ్ములను చేయు
దారిద్ర్యమొందావయ్యా.. || కన్నీటిని||
(Bangaaram Adugaledu Vajraalu Adugaledu)