నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా
నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా
దావీదు కుమారుడా – నను దాటిపొకయా
నజరేతువాడా – నను విడిచిపోకయా
1. గ్రుడ్డి వాడినయ్యా – నా కనులు తెరువవా
మూగవాడినయ్యా – నా స్వరము నియ్యవా
కుంటి వాడినయ్య – నా తోడు నడువవా || దావీదు||
2. లోకమంత చూసి – నను ఏడిపించినా
జాలితో నన్ను – నీవు చేరదీయవా
ఒంటరి నయ్యా – నాతోడు నిలువవా || దావీదు||
3. నా తల్లి నన్ను – మరచిపోయిన
నా తండ్రి నన్ను – విడిచిపోయిన
తల్లితండ్రి నీవై నను లాలించుమా || దావీదు||
(Neevu Thappa Naakeelokamlo Yevarunnaarayaa)