నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్ధీకరించున్
నీ రక్తమే నా బలము
1. నీ రక్తధారలే ఇల పాపికాశ్రయంబిచ్చును
పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము
2. నశియించు వారికి నీ సిలువ వెర్రితనముగ నున్నది
రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తియై యున్నది
3. నీ సిల్వలొ కార్చినట్టి విలువైన రక్తముచే
పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవ తనయుడా
4. పంది వలె పొర్లిన నన్ను కుక్క వలె తిరిగిన నన్ను
ప్రేమతో చేర్చుకొంటివి ప్రేమార్హ నీకె స్తోత్రము
5. నన్ను వెంబడించు సైతానున్ నన్ను బెదరించు సైతానున్
దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే
6. స్తుతి మహిమ ఘనతయు యుగయుగంబులకును
స్తుతి పాత్ర నీకె చెల్లును స్తోత్రార్హుడా నీకె తగును
(Nee Rakthame Nee Rakthame Nan Shuddhikarinchun)