నా జీవం నా సర్వం నీవే దేవా

నా జీవం నా సర్వం నీవే దేవా (2)
నా కొరకే బలి అయిన గొర్రెపిల్ల
నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా

1. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి
మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివే (2)
ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై
విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును (2)

నీవే నీవే నీవే దేవా (4)

(Naa Jeevam Naa Sarvam Neeve Devaa)