అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన నా దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే –
ఆరాధింతును నిన్నే (2)
ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా (3)
ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. ఆమెన్
1. ఆశ్చర్యకరుడా స్తోత్రం
ఆలోచనకర్తా స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి
సమాధాన అధిపతి స్తోత్రం (2) “ఆహాహా”
2. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం
కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే
నా రక్షణకర్తా స్తోత్రం (2) “ఆహాహా”
3. స్తుతులపై ఆసీనుడా స్తోత్రం
సంపూర్ణుడా నీకు స్తోత్రం
మా ప్రార్థనలు ఆలకించువాడా
మా ప్రధాన యాజకుడా స్తోత్రం (2) “ఆహాహా”
4. మృత్యుంజయుడా స్తోత్రం
మహాఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవ త్వరలో రానున్న
మేఘ వాహనుడా స్తోత్రం (2) “ఆహాహా”
5. ఆమెన్ అనువాడా స్తోత్రం
అల్ఫా ఒమేగా స్తోత్రం
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా
అత్యున్నతుడా స్తోత్రం (2) “ఆహాహా”
(Athyunnatha Simhaasanamupai Aaseenudavaina