నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు

నీ చేతితో నన్ను పట్టుకో –
నీ ఆత్మతో నన్ను నడుపు
శిల్పి చేతిలో శిలను నేను –
అనుక్షణము నన్ను చెక్కుము – 2

1. అంధకార లోయలోన –
సంచరించినా భయము లేదు
నీ వాక్యం శక్తి గలది –
నా త్రోవకు నిత్య వెలుగు – 2                   “నీ చేతితో”

2. ఘోర పాపిని నేను తండ్రి –
పాప ఊభిలో పడియుంటిని
లేవనెత్తుము శుద్దిచేయుము –
పొందనిమ్ము నీదు ప్రేమను – 2             “నీ చేతితో”

3. ఈ భువిలో రాజు నీవే –
నా హృదిలో శాంతి నీవే       
కుమ్మరించుము నీదు ఆత్మను –
జీవితాంతము సేవ చేసెదన్ – 2    “నీ చేతితో”

(Nee Chethitho Nannu Pattuko Nee Aathmatho Nannu Nadupu)