ఉన్నతమైన స్థలములలో – ఉన్నతుడా మా దేవా
ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా
1. చెదరి పోయినది మా దర్శనము –
మందగించినది ఆత్మలభారం
మరచిపోతిమి నీ తొలిపిలుపు –
నీ స్వరముతో మము మేలుకొలుపు
నీ ముఖకాంతిని ప్రసరింపచేసి –
నూతన దర్శన మీయుము దేవా
నీ సన్నిధిలో సాగిలపడగా –
ఆత్మతో మము నిలుపుము దేవా “ఉన్నత”
2. పరిశోధించుము మా హృదయములను –
తెలిసికొనుము మా తలంపులను
ఆయాసకరమైన మార్గము మాలో –
వున్నదేమో పరికించు చూడు
జీవపు ఊటలు మాలోన నింపి –
సేదదీర్చి బ్రతికించు మమ్ము
మా అడుగులను నీ బండపైన –
స్థిరపరచి బలపరచుము దేవా “ఉన్నత”
3. మా జీవితములు నీ సన్నిధిలో –
పానార్పణముగా ప్రోక్షించెదము
సజీవయాగ శరీరములతో –
రూపాంతర నూతన మనసులతో
నీ ఆత్మకు లోబడి వెళ్ళెదము –
నీ కృపచేత బలపడియెదము
లోకమున నీ వార్తను మేము –
భారము తోడ ప్రకటించెదము “ఉన్నత”
(Unnathamaina Sthalamulalo Unnathudaa Maa Deva Unnathamaina Nee Maargamulu)