శిరము వంచెను సర్వ లోకము –
యేసు దేవా నీ ముందు (2)
సంతసించెను ప్రతి హృదయం – 2
రక్షక నీ జన్మయందు – 2
1. పుట్టిపెరిగి రాజులయ్యేది సహజము –
రాజుగానే ఉదయించినావు చిత్రము (2)
మహిమ సింహాసనం – విడిచి నాకోసము – 2
పశుల పాకలో పుట్టినావు స్తోత్రము – 2
2. యుద్హముచేసి రాజ్యమేలేది సహజము –
శాంతి రాజ్యము స్థాపించినావు చిత్రము (2)
పరలోకానందము – చేసితివి త్యాగము – 2
మంటిదేహము దాల్చినావు స్తోత్రము – 2
3. పుట్టి ఒకడు తనను యెరుగుట సహజము –
ముందే యెరిగి జన్మించినావు చిత్రము (2)
మార్పు చేసుకొని నీ మహిమ రూపము – 2
మనిషి రూపులో – వచ్చినావు స్తోత్రము – 2
(Siramu Vanchenu Sarva Lokamu Yesu Devaa Nee Mundu)