రాజులకు రాజు పుట్టెనన్నయ్య రారే చూడ మనమేగుదామన్నయ్య

రాజులకు రాజు పుట్టెనన్నయ్య (2)
రారే చూడ మనమేగుదామన్నయ్య (2)

1. యుదాయనే దేశమందన్నయ్య (2)
యూదులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్య (2)   “రాజులకు”

2. తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య (2)
తరలినారే వారు బెత్లెహేమన్నయ్య (2)     “రాజులకు”

3. బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య (2)
బాగుగాను శ్రీ యేసు కీయరన్నయ్య (2)   “రాజులకు”

4. ఆడుదాము పాడుదామన్నయ్య (2)
వేడుకతో మనమేగుదామన్నయ్య (2)     “రాజులకు”

(Raajulaku Raaju Puttenannayya Raare Chuda Manamegudaamannayya)