బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి

బెత్లెహేములో సందడి
పశుల పాకలో సందడి
శ్రీ యేసు పుట్టాడని
మహారాజు పుట్టాడని (2) 

1. ఆకాశములో సందడి
చుక్కలలో సందడి (2)
వెలుగులతో సందడి
మిల మిల మెరిసే సందడి (2)       “బెత్లెహేములో”

2. దూతల పాటలతో సందడి
సమాధాన వార్తతో సందడి (2)
గొల్లల పరుగులతో సందడి
క్రిస్మస్ పాటలతో సందడి (2)       “బెత్లెహేములో”

3. దావీదు పురములో సందడి
రక్షకుని వార్తతో సందడి (2)
జ్ఞానుల రాకతో సందడి
లోకమంతా సందడి (2)       “బెత్లెహేములో”

(Bethlehemulo Sandadi Pasula Paakalo Sandadi)