నా యేసు రాజు నాకై పుట్టిన రోజు (2)
క్రిస్మస్ పండుగా హృదయం నిండుగా (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ – మెర్రి మెర్రి క్రిస్మస్ (2)
1. పరలోకమునే విడిచెను
పాపిని నను కరుణించెను
పశు పాకలో పుట్టెను
పశువుల తొట్టిలో వింతగా (2) “హ్యాపీ”
2. నమ్మిన వారికి నెమ్మది
ఇమ్ముగనిచ్చి బ్రోవఁగా
ప్రతి వారిని పిలిచెను
రక్షణ భాగ్యమునివ్వగా (2) “హ్యాపీ”
3. సంబరకరమైన క్రిస్మస్
ఆనందకరమైన క్రిస్మస్
ఆహ్లాదకరమైన క్రిస్మస్
సంతోషకరమైన క్రిస్మస్ (2) “హ్యాపీ”
(Naa Yesu Raaju Naakai Puttina Roju Christmas Pandugaa)