అంబరానికి అంటేలా
సంబరాలతో చాటాలా (2)
యేసయ్య పుట్టాడని
రక్షింప వచ్చాడని (2)
1. ప్రవచనాలు నెరవేరాయి
శ్రమ దినాలు ఇక పోయాయి (2)
విడుదల ప్రకటించే
శిక్షను తప్పించే (2) “యేసయ్య”
2. దివిజానాలు సమకూరాయి
ఘనస్వరాలు వినిపించాయి (2)
పరముకు నడిపించే
మార్గము చూపించే (2) “యేసయ్య”
3. సుమ వనాలు పులకించాయి
పరిమళాలు వెదజల్లాయి (2)
ఇలలో నశియించే
జనులను ప్రేమించే (2) “యేసయ్య”
(Ambaraaniki Antela Sambaraalatho Chaataalaa)