మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా
మరల మంటిలో కలవవలయురా
తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా
ఇల సంపాదన వదలవలయురా (2)
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో
ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో (2)
1. ఒకేసారి జన్మిస్తే రెండు సార్లు చావాలి
ఆరిపోని అగ్నిలో యుగయుగాలు కాలాలి (2)
క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు
స్వర్గానికి ఆయనతో వారసులౌతారు (2) “మనిషిగా”
2. జన్మనిచ్చినవాడు యేసు క్రీస్తు దేవుడే
జన్మించకముందే నిన్నెరిగిన నాథుడే (2)
ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే
నీ జన్మకు నిజమైన అర్ధముందిలే (2) “మనిషిగా”
3. నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు
చచ్చినాక ఏమౌనో ఎవరికి తెలుసనకు (2)
నీలోని ఆత్మకు స్వర్గమో నరకమో
నిర్ణయించు సమయమిదే కళ్ళు తెరుచుకో (2) “మనిషిగా”
(Manishigaa Puttinodu Mahaathmudainaa Marala Mantilo Kalavavalayuraa)